10-01-2025 12:23:57 AM
హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 9 (విజయక్రాంతి): ఎస్సీ వర్గీకరణకు అన్ని వర్గాల మద్దతు ఉందని, వర్గీకరణను అడ్డుకునే శక్తులకు లక్షలాది డప్పులతో సమాధానం చెప్తా ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగ పేర్కొన్నారు. వర్గీకరణను అడ్డుకుంటే చరిత్రహీనులుగా మిగిలిపోతారని హెచ్చరించారు.
గురువారం ఓయూ పీజీఆర్‌ఆర్‌సీడీఈలో ఎంఎస్‌ఎఫ్ ఆధ్వర్యంలో జరిగిన ఓయూ విద్యార్థి సంఘాల నాయకులతో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఓయూ విద్యార్థి నాయ నలిగంటి శరత్‌చమర్, గేయ రచయిత దరువు ఎల్లన్న ఈ సమావేశానికి సమన్వయ కర్తలుగా వ్యవహరించారు.
ఈ సందర్భంగా మందకృష్ణ మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఫిబ్రవరి 7న నగరంలో నిర్వహించే ‘వేల గొంతులు లక్ష డప్పులు’ ప్రదర్శనను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఎమ్మా రాష్ట్ర అధ్యక్షుడు గోవింద్ నరేశ్, ఎంఎస్‌ఎఫ్ నాయకులు సోమశేఖర్ మాది కొమ్ము శేఖర్, వలిగొండ నర్సింహ, పృథ్వీరాజ్, అంజన్న, అంజిబాబు పాల్గొన్నారు.