01-08-2025 01:45:42 AM
హైదరాబాద్, జూలై 31 (విజయక్రాంతి): తెలంగాణ యూనివర్సిటీ లో ఇంజినీరింగ్ కళాశాల ఏర్పాటు కు ప్రభుత్వం అంగీకరించింది. ఈ మేరకు గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కళాశాలలో కంప్యూటర్ సైన్స్, డేటా సైన్స్, ఏఐ, ఐటీ కోర్సులలో ఈ విద్యాసంవత్సరం నుంచే ప్రవేశాలు కల్పిస్తారు.
ఎప్‌సెట్ మూ డో విడత కౌన్సెలింగ్ ద్వారా ప్రవేశాలకు ప్రభుత్వం అనుమతులిచ్చింది. ప్రభుత్వం తీసుకున్న ఈ తాజా నిర్ణయంతో నిజామాబాద్ జిల్లా విద్యా ర్థులకు మేలు కలుగనుంది. ఎప్‌సె ట్ రెండు విడతల సీట్లను కేటాయిండంతో చాలామంది విద్యార్థులు ఇప్పటికే వేర్వేరు కాలేజీల్లో ప్రవేశాలు పొందారు.