calender_icon.png 1 August, 2025 | 10:38 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

టీచర్ల ప్రమోషన్ షెడ్యూల్ విడుదల

01-08-2025 01:47:43 AM

హైదరాబాద్, జూలై 31 (విజయక్రాంతి): టీచర్ల ప్రమోషన్లకు సంబంధించిన షెడ్యూల్‌ను విద్యాశాఖ గురువారం విడుదల చేసింది. ఈనెల 2 నుంచి ప్రమోషన్ల ప్రక్రియ ప్రారంభించి 11వరకు పూర్తి చేయాలని నిర్ణయించింది. జూన్ 30 వరకు ఖాళీ అయిన స్థానాలతో భర్తీ చేయనున్నారు.

4 వేల మందికి పదోన్నతులు లభించనున్నాయి. 2న ఖాళీలను వెబ్‌సైట్‌లో ఉంచుతారు. 3న సీనియారిటీ జాబితాపై అభ్యంతరాలు, 4న తుది జాబితా, 7న స్కూల్ అసిస్టెంట్‌లకు గ్రేడ్ హెడ్‌మాస్టర్లుగా ప్రమోషన్లు, 8న ఎస్జీటీల తుది జాబితా, 11న ఎస్జీటీలకు స్కూల్ అసిస్టెంట్ పదోన్నతుల జారీ.