28-01-2025 12:43:53 AM
న్యూఢిల్లీ, జనవరి 27: నార్త్ ఢిల్లీలోని బురారి ప్రాంతంలో నాలుగంతస్తుల భవనం సోమవారం సాయంత్రం కుప్పకూలింది. భవన శిథిలాల కింద జనాలు ఉండొచ్చని ఢిల్లీ ఫైర్ సర్వీస్ అథారిటీ అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక దళాలు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని సహయక చర్యలు చేపట్టాయి. ఈ ఘటన చాలా బాధాకరమని ఆప్ అధినేత కేజ్రీవాల్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.