28-11-2025 12:00:00 AM
హాజరుకానున్న జస్టిస్ పమిడిఘంటం శ్రీ నరసింహ
డాక్టర్ గజల్ శ్రీనివాస్ వెల్లడి
హైదరాబాద్, నవంబర్ 27 (విజయక్రాంతి): ఆంధ్ర సారస్వత పరిషత్తు ఆధ్వర్యం లో 2026 జనవరి 3, 4, 5 తేదీల్లో శ్రీ సత్య సాయి స్పిరిచువల్ సిటీ ప్రాంగణంలో జరుగనున్న 3వ ప్రపంచ తెలుగు మహా సభలకు సుప్రీంకోర్టు సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ పమిడిఘంటం శ్రీ నరసింహ హాజరు కానున్నారని ఆంధ్ర సారస్వత పరిషత్తు అధ్యక్షుడు డా.గజల్ శ్రీనివాస్ తెలిపారు. ఆయనను ఢిల్లీలోని గృహంలో కలసి ఆహ్వానించామ ని, జనవరి 3 న తెలుగు మహా సభల ప్రా రంభోత్సవానికి సతీ సమేతంగా హాజరు కా నున్నట్లు గజల్ శ్రీనివాస్ తెలిపారు.
తెలుగు భాషను అజరామరం చేయడానికి అన్ని సం స్థలు కలసిపని చేయాలని, సంస్థా గతమైన వ్యవస్థను ఏర్పరచుకొని మాతృభాష తెలుగును ఉద్యమ స్ఫూర్తిగా రాబోయే తరాల వారికి అందించేటట్లు అందరూ పని చేయాలని జస్టిస్ శ్రీ నరసింహా అభిప్రాయ పడ్డా రని డా.గజల్ శ్రీనివాస్ తెలిపారు.