18 April, 2026 | 4:38 AM

బల్కంపేట దేవస్థానం బోర్డు సభ్యుడిగా సురేశ్‌వర్మ

28-06-2025 12:04 AM

అభినందించిన రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్

సనత్ నగర్,జూన్ 27 (విజయ క్రాంతి): బల్కంపేట ఎల్లమ్మ దేవస్థానం బోర్డు సభ్యుడిగా నియమితులైన పీ సురేశ్ వర్మకు ఎంపీ అనిల్‌కుమార్ యాదవ్ అభినందన లు తెలిపారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. బల్కంపేట ఎల్లమ్మ ఆలయం ఆధ్యా త్మిక, సాంస్కృతిక పుణ్యక్షేత్రమని, ఈ ఆల య అభివృద్ధికి, భక్తులకు మెరుగైన సౌకర్యాలకీ సురేశ్ వర్మ నిబద్ధతతో పనిచేస్తారని పూర్తి నమ్మకమున్నదన్నారు.

ఈ సందర్భం లో  గోదాసి అజయ్ కుమార్, ఐల మధు గౌడ్, ఆకుల వేణునాథ్, కోతింటి కిషోర్, పలు రాజకీయ, సామాజిక రంగాల ప్రముఖులు, ఆలయ భక్తులు, అభిమానులు సైతం సురేష్ వర్మకి శుభాకాంక్షలు తెలియజేశారు.