31-12-2025 07:03:36 PM
మంథని లో ప్రిన్సిపల్ సయ్యద్ సలీం పదవి విరమణ లో పెద్దపల్లి డిఐఈఓ కల్పన
మంథని,(విజయ క్రాంతి): ఉద్యోగుల జీవితంలో పదవీ విరమణ అనేది తప్పనిసరని పెద్దపల్లి జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారిని కల్పనా అన్నారు. బుధవారం మంథని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ సయ్యద్ సలీం పదవి విరమణ కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సయ్యద్ సలీం 30 సంవత్సరాలకి పైగా ఉపాధ్యాయ, అధ్యాపక జీవితంలో ఎంతోమంది ఉన్నత స్థానాల్లో నిలవడానికి కారణమయ్యారన్నారు.
విధుల్లో అందరితో సరదాగా ఉంటూనే విధుల పట్ల నిర్లక్ష్యం వహించిన వారిని క్రమశిక్షణలో పెట్టడంలో ముందుంటారన్నారు. తమతో ఎన్నో ఏళ్ళుగా కలిసి పనిచేసిన సలీం సార్ తమ విధుల నుండి దూరం అవుతున్న బాధ ఎంతో ఉంటుందన్నారు. అయన తన శేష జీవితాన్ని ఆనందోత్సవాలతో కుటుంబల మధ్య గడపాలన్నారు. పాఠశాల ఉపాధ్యాయ స్థాయి నుంచి కళాశాల ప్రిన్సిపల్ గా పనిచేసే నేడు పదవీ విరమణ పొందిన సయ్యద్ సలీం సేవలను కొనియాడారు. అనంతరం ఆయనను ఘనంగా సన్మానించి జ్ఞాపికను అందజేశారు.