31-12-2025 06:20:48 PM
ఉప్పల్,(విజయక్రాంతి): నాచారం వార్డు కార్యాలయంలో నూతనంగా ఏర్పాటైన సర్కిల్ కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలని ఉప్పల్ జోనల్ కమిషనర్ రాధిక గుప్తాకు BRS పార్టీ రాష్ట్ర నాయకులు సాయిజెన్ శేఖర్, పూర్వ నాచారం డివిజన్ బీఆర్ఎస్ నాయకులు ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సాయిజెన్ శేఖర్ మాట్లాడుతూ... నాచారం ఓల్డ్ విలేజ్లో రూ.కోటి యాభై లక్షల వ్యయంతో నిర్మించిన వార్డు కార్యాలయాన్ని సర్కిల్ కార్యాలయానికి ఉపయోగించుకోవాలని ఉప్పల్ కమిషనర్ రాధిక గుప్తకు విన్నవించుకున్నట్టు తెలిపారు. హెచ్ఎంటి నగర్ పెద్ద చెరువులో గుర్రపు డెక్క విపరీతంగా పెరిగిందని దీనికి సంబంధించిన కాంట్రాక్టర్కుచే ఇంజనీరింగ్ అధికారులు పనులు చేయించాల్సింది పోయి బిల్లులు చెల్లిస్తున్నారని ఫిర్యాదు చేసినట్లు శేఖర్ పేర్కొన్నారు. దీనికను కమిషనర్ సానుకూలంగా స్పందించారని ఆయన తెలిపారు.