calender_icon.png 31 December, 2025 | 8:28 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గొర్రెల నట్టల మందు పంపిణీ

31-12-2025 06:59:33 PM

కొత్తపల్లి,(విజయక్రాంతి): గొర్రెల్లో తరచుగా వచ్చే నట్టల సమస్యల నివారణ కోసం మొగ్దుంపూర్ గ్రామంలో గొర్ల కాపారుల సంక్షేమ సంఘం అధ్యక్షులు బండి మల్లన్న యాదవ్ ఆద్వర్యంలో బుధవారం రోజున నట్టల నివారణ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమనికి ముఖ్య అతిథిగా సర్పంచ్ సీనమ్మ, ఉపసర్పంచ్ కూకట్ల రమేష్ పాల్గొని, పశువైద్యాదికారుల సమక్షంలో నట్టల మందు పంపిణి చేశారు. ఈ కార్యక్రమంలో వార్డ్ మెంబర్ కూకట్ల సంజీవ్, సోసైటీ ఉపాధ్యక్షులు కాల్వ శ్రీనివాస్ యాదవ్, కార్యదర్శి కూకట్ల కొమురయ్య, గొర్ల పెంపకం దారులు పాల్గొన్నారు.