31-12-2025 07:07:48 PM
మంత్రి దుద్ధిల్లా శ్రీధర్ బాబుకు వినతి పత్రం
జవహర్ నగర్,(విజయక్రాంతి): జవహర్‌నగర్ పరిధిలోని అంబేద్కర్ నగర్ నుండి. చెన్నపురం వరకు ఉన్న సుమారు 50 కాలనీలను కలిపి ఒక ప్రత్యేక గ్రేటర్ హైదరాబాద్ డివిజన్‌గా ఏర్పాటు చేయాలని కోరుతూ స్థానిక నాయకులు, కాలనీవాసుల బృందం. బుధవారం మేడ్చల్ మల్కాజిగిరి ఇంచార్జ్. ఐటీ మంత్రి దుద్ధిల్లా శ్రీధర్ బాబు ని కలిసి వినతి పత్రం అందజేశారు. అభివృద్ధిలో వెనుకబాటు గత 30 ఏళ్లుగా ఈ ప్రాంతం అభివృద్ధికి ఆమడదూరంలో ఉందని, జవహర్‌నగర్ డంపింగ్ యార్డ్ వల్ల ఇక్కడి ప్రజలు తీవ్రమైన దుర్వాసనతో, ఆరోగ్య సమస్యలతో నరకయాతన అనుభవిస్తున్నారని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.
లక్షకు పైగా జనాభా, 50కి పైగా కాలనీలు ఉన్నప్పటికీ, ఈ ప్రాంతాన్ని ప్రత్యేక డివిజన్‌గా గుర్తించకపోవడం వల్ల పాలన పరంగా ఇబ్బందులు ఎదురవుతున్నాయని వివరించారు.ప్రతినిధుల విన్నపాన్ని సావధానంగా విన్న మంత్రి, ఈ ప్రాంత సమస్యలపై సానుకూలంగా స్పందించారు. నూతన డివిజన్ల ఏర్పాటు ప్రక్రియలో అంబేద్కర్ నగర్ - చెన్నపురం ప్రతిపాదనను పరిశీలించి, తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కాలనీ అసోసియేషన్ ప్రతినిధులు మరియు పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. ప్రత్యేక డివిజన్ ఏర్పాటైతేనే తమ ప్రాంతానికి నిధులు మంజూరై, మౌలిక సదుపాయాలు మెరుగుపడతాయని వారు వ్యక్తం చేశారు. గూడెల్లి సురేష్ ముదిరాజ్. మాజీ ఎంపీటీసీ పంతంగి సిద్దులు యాదవ్.దంతూరి శివకుమార్ గౌడ్. తదితరులు పాల్గొన్నారు.