31-12-2025 06:56:17 PM
బాన్సువాడ,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని వాసవి ఉన్నత పాఠశాల విద్యార్థులు బుధవారం సెల్ ఫోన్ ను తెలివిగా ఉపయోగించడం ఎలా అనే అంశంపై అవగాహన ర్యాలీని నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా పిల్లలందరూ చక్కగా పాల్గొని సెల్ ఫోన్ వినియోగంపై వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా పిల్లలు నృత్య ప్రదర్శనలతో, నినాదాలతో ప్రజలకు సెల్ ఫోన్ ను అనవసర విషయాలకు కాకుండా మన అవసరానికి ఏ విధంగా ఉపయోగించాలో అవగాహన కల్పించడం జరిగింది.