31-12-2025 06:49:24 PM
వార్డు సభ్యుడు ఆనగంటి కృష్ణ
మునుగోడు,(విజయక్రాంతి): ప్రభుత్వ పాఠశాలలో చదివే ప్రతి విద్యార్థికి అండగా ఉంటానని వార్డు సభ్యుడు ఆనగంటి కృష్ణ అన్నారు. బుధవారం మండలంలోని పలివెల గ్రామంలో ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు పలకలు, పెన్నులతో పాటు పలు ఉపయోగపడే వస్తువులను పంపిణీ చేసి మాట్లాడారు. ప్రైవేటు వ్యవస్థను అరికట్టడంతో పాటు ప్రభుత్వ పాఠశాలలో బలోవేతానికి తన వంతుగా కృషి చేస్తానని అన్నారు.
విద్యార్థులకు ప్రభుత్వ ఉద్యోగాలు రావాలంటే ప్రభుత్వ పాఠశాలలోనే చదివించాలని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ చెరుకు సునీత సైదులు, వార్డు సభ్యులు కొండూరి మాధవి,బత్తుల శేఖర్,గోసు కొండ మల్లేష్, ఆదే సత్యనారాయణ,ఉయ్యాల సోమయ్య, దాడి జితేందర్ రెడ్డి,సొల్లేటి నరసింహ చారి,రాజేందర్ రెడ్డి,రాము, శ్రీనివాసు,మల్లయ్య ఉన్నారు.