calender_icon.png 29 May, 2025 | 4:28 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భూముల కొలతల సర్వేలో సర్వేయర్లే కీలకం

28-05-2025 12:00:00 AM

కలెక్టర్ రాజర్షి షా

అదిలాబాద్, మే 27 ( విజయక్రాంతి):  భూముల కొలతలలో సర్వేయర్ల పాత్ర చాలా ముఖ్యమని, భూమి సరిహద్దులను గుర్తించడం, కొలతలను తీసుకోవడం, భూమి నమూనాలను తయారు చేయడం ద్వారా సర్వేయర్లు భూమిని సరిగ్గా ఉపయోగించి, ప్లాన్ చేయడానికి సహాయపడతారని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని టీటీడీసీలో మంగళవా రం లైసెన్స్ సర్వేయర్ల శిక్షణ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శ్యామలాదేవి, సర్వె అండ్ లాండ్ రికార్డు ఏడీ  రాజేందర్‌తో కలిసి కలెక్టర్  సర్వేయర్లకు సర్వే మెటీరియల్ పంపిణి చేశారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడు తూ మే 26 జులై 26 వరకు సుమారు 50 రోజుల పాటు లైసెన్స్ సర్వేయర్లకు ఇచ్చే శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని సూచిం చారు. వివిధ రకాల సర్వేలను నిర్వహించి భూమి స్థానం, కోణం, దూరాన్ని నిర్ణయించడానికి సాంకేతిక పరికరాలను ఉపయోగిం చాలన్నారు.   శిక్షణలో ఆన్ని అంశాలపై అవగాహన కలిగి ఉండాలని సూచించారు.

ప్రత్యేకించి రెవెన్యూకు సంబంధించిన గ్రామాలు, మండలాల అంతర్గత సరిహద్దు ల నిర్ణయంలో, అలాగే అంతర్గత సరిహద్దుల వివాదాల పరిష్కారానికి నిర్వహించే సర్వే విషయంలో సర్వేయర్లదే ముఖ్యపాత్ర అని, కనుక సర్వేయర్లు శిక్షణకు హాజరై  జా గ్రత్తగా అన్ని అంశాలను క్షుణ్ణంగా విని అర్థం చేసుకొని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమానికి ఉట్నూర్ డిప్యూటి ఇన్స్పెక్టర్ రామేశ్వర్, సర్వేయర్ గోవింద్ రావ్,  నిషార్ అహ్మద్, ఫ్యాకల్టీ  తల్మీనోద్దీన్, లక్ష్మణ్, తదితరులు పాల్గొన్నారు