calender_icon.png 7 October, 2025 | 7:14 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాజకీయ పార్టీల ప్రతినిధులతో సీఈవో సమీక్ష

07-10-2025 05:15:54 PM

హైదరాబాద్: నగరంలోని జూబ్లీహిల్స్ ఉపఎన్నికకు కేంద్ర ఎన్నికల కమీషన్ పోలింగ్ తేదీని ప్రకటించిన విషయం తెలిసిందే. మంగళవారం రాజకీయ పార్టీల ప్రతినిధులతో తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్‌రెడ్డి సమావేశం నిర్వహించారు. ఈ నేపథ్యంలో జూబ్లీహిల్స్ ఉపఎన్నిక అంశంపై పలు రాజకీయ పార్టీలతో చర్చించిన సీఈవో ఈసీ సంస్కరణలు, కొత్త మార్పులను వివరించారు. ఈ ఉపఎన్నికల్లో ఈవీఎంపై అభ్యర్థుల కలర్ ఫోటోలు ఉంటాయని తెలిపారు. ఎన్నికల నియమావళిని కచ్చితంగా పాటించాలని రాజకీయ పార్టీలకు సీఆవో సూచనలు జారీ చేశారు.