calender_icon.png 12 October, 2025 | 9:40 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పోలీస్ స్టేషన్‌లో స్వచ్ఛ భారత్

11-10-2025 06:48:42 PM

కాటారం,(విజయక్రాంతి): పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని కాటారం డి.ఎస్.పి సూర్యనారాయణ గౌడ్ అన్నారు. శనివారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం పోలీస్ స్టేషన్ పరిసరాలలో స్వచ్ఛభారత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. పిచ్చి మొక్కలను తొలగించారు. స్టేషన్ సరిహద్దులో గల కాంపౌండ్ వాల్ పైన పేరుకుపోయిన చెట్ల గుబురు, పొదలను తీసివేశారు. ఈ కార్యక్రమంలో కాటారం డిఎస్పి సూర్యనారాయణ, సిఐ నాగార్జున రావు, 1,2,3  ఎస్సైలు శ్రీనివాస్, రాజశేఖర్, మానస లతో పాటు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.