calender_icon.png 13 October, 2025 | 12:15 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వ్యవసాయ కార్మికులను పట్టించుకోని ప్రభుత్వాలు

12-10-2025 09:14:03 PM

సంక్షేమ పథకాలు అందని ద్రాక్షే..

కొత్తగూడెం (విజయక్రాంతి): కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవసాయ కార్మికులను పట్టించుకోవడం లేదని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి రేపాకుల శ్రీనివాస్ విమర్శించారు, ఆదివారం  జిల్లా కమిటీ సమావేశం మచ్చ వెంకటేశ్వర్లు అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ వ్యవసాయ కార్మికులకు సంక్షేమ పథకాలు అందించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చిత్తశుద్ధి లేదన్నారు, బిజెపి ప్రభుత్వం నల్లదనం తెచ్చి పేదల బ్రతుకులు మారుస్తానని, జీరో ఎకౌంట్లు తీసుకోవాలని మాయమాటలు చెప్పి ఓట్లు వేయించుకుని మోసం చేసిందని విమర్శించారు, జీరో ఎకౌంటులో డబ్బులు ఎప్పుడు వేస్తారో బిజెపి ప్రభుత్వం సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. దేశంలో పేదరికం తగ్గిందని సిగ్గు లేకుండా అబద్ధాలు చెబుతున్నారని అన్నారు, పేదరికం తగ్గాలంటే ప్రభుత్వం ఉపాధి అవకాశాలు, సొంత ఇల్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు.

ప్రభుత్వం సహాయం చేయకపోగా ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేస్తుందన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ కార్మికులకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం అమలు చేస్తామని మాయ మాటలు చెప్పి మోసం చేసిందన్నారు. ఇందిరమ్మ ఇంటి కోసం ఆశగా ఎదురు చూస్తున్న పేదలకు నిరాశే మిగిలిందన్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇంటింటి సర్వేలో వ్యవసాయ కార్మికుల డేటా ప్రకారం అందరికీ ఒకేసారి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కమిటీ సభ్యులు అన్నవరపు కనకయ్య, బి. చిరంజీవి, శెట్టి వినోద, నిమ్మల వెంకన్న, ముదిగొండ రాంబాబు, మర్మం చంద్రయ్య,గడ్డం స్వామి, బత్తుల వెంకటేశ్వర్లు, జంగిలి వెంకటరత్నం, ఈసం నర్సింహారావు, బందెల చంటి, లక్ష్మయ్య, రావుజ, తేజావత్ వెంకన్న తదితరులు పాల్గొన్నారు.