calender_icon.png 12 October, 2025 | 11:35 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాంగ్రెస్ ప్రభుత్వం గురించి మాట్లాడటం చిరుమర్తికి సరికాదు..

12-10-2025 08:47:59 PM

సింగిల్ విండో చైర్మన్ ఏనుగు రఘుమా రెడ్డి..

చిట్యాల (విజయక్రాంతి): కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, ప్రభుత్వ అధికారులను అర్థరహితంగా మాట్లాడడం మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యకు సరికాదని సింగిల్ విండో చైర్మన్ ఏనుగు రఘుమా రెడ్డి ఆదివారం విలేకరుల సమావేశంలో తెలిపారు. నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య శనివారం కాంగ్రెస్ పార్టీపై చేసిన ఆరోపణలను వెలిమినేడు సింగిల్ విండో చైర్మన్ ఏనుగు రఘుమా రెడ్డి తీవ్రంగా ఖండించారు. ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రభుత్వ అధికారులను అర్థరహితంగా మాట్లాడడం మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యకు సరికాదని, అవగాహన లేకుండా అభివృద్ధి గురించి తెలుసుకోకుండా మాట్లాడడం సరికాదన్నారు. ప్రస్తుతం ధాన్యం కొనుగోలు కేంద్రానికి 10 శాతం మాత్రమే పంట వచ్చిందని, గత ప్రభుత్వాల కంటే ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా పది రోజుల ముందే ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే ఆధ్వర్యంలో ప్రారంభించమని అన్నారు.

రాజకీయ ఉనికి కోసం ప్రభుత్వంపై దుమ్మెత్తి పోయడం సరికాదన్నారు. దళారీ వ్యవస్థను పెంచి పోషించింది బిఆర్ఎస్ ప్రభుత్వమేనని , నమ్ముకున్న కాంగ్రెస్ పార్టీని తాకట్టు పెట్టిన చరిత్ర నీకు ఉంది అని అన్నారు. కాంగ్రెస్ పార్టీ నమ్మి ఎమ్మెల్యేని చేస్తే దళారీ వ్యవస్థలో కార్యకర్తల కష్టాన్ని బిఆర్ఎస్ పార్టీకి తాకట్టు పెట్టింది మర్చిపోయావా అంటూ  ఘాటుగా విమర్శించారు. అవగాహన లేకుండా ప్రభుత్వాన్ని, ప్రభుత్వ అధికారులను, మంత్రులను విమర్శించడం సిగ్గుచేటని, కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కాకముందే దళారీ వ్యవస్థను పెంచి పోషించిన చరిత్ర బిఆర్ఎస్ పార్టీకి ఉంది అని అన్నారు. తెలంగాణ రైతులకు అందరికీ రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వంకు ఉందని, గత ప్రభుత్వం విడతల వారీగా రైతులకు రుణమాఫీతో రైతులకు న్యాయం జరగలేదన్నారు. రైతుల ఆత్మహత్యలకు కారణమైన పార్టీ బిఆర్ఎస్ పార్టీ అని దుయ్యబట్టారు.

ప్రజల ముందు మాట్లాడేటప్పుడు కాంగ్రెస్ చేస్తున్న అభివృద్ధి పనుల గురించి, ప్రభుత్వం సంక్షేమ పథకాల గురించి తెలుసుకొని జాగ్రత్తగా మాట్లాడాలన్నారు. అసత్య ప్రచారాలు చేస్తే కాంగ్రెస్ పార్టీ నుంచి గట్టి తిరుగుబాటు వస్తుందని ప్రజలలో తిరగకుండా చేస్తామని హెచ్చరించారు. దేశ చరిత్రలో కులగనల చేసిన ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ అని బీసీ రిజర్వేషన్లపై మాట్లాడే అర్హత నీకు లేదని విమర్శించారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు గుడిపాటి లక్ష్మీ నరసింహ, మాజీ మార్కెట్ చైర్మన్ కాటం  వెంకన్న, సింగిల్ విండో వైస్ చైర్మన్ బొంతల  అంజిరెడ్డి, మాజీ సర్పంచ్ లు దేశబోయిన మల్లమ్మ, సామిడి మోహన్ రెడ్డి, నారగోని దుర్గయ్య,మాజీ ఎంపిటీసి దుబ్బ కుమారస్వామి, గుండ్రాంపల్లి గ్రామశాఖ అధ్యక్షుడు నమ్ముల  విజయ్ కుమార్, సుంకెనపల్లి గ్రామశాఖ అధ్యక్షుడు యాకారి లింగస్వామి, పిట్టంపల్లి గ్రామ శాఖ అద్యక్షుడు మేడి కృష్ణ తదితరులు పాల్గొన్నారు.