calender_icon.png 13 October, 2025 | 12:15 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బ్యాంక్ ఆధీనంలో ఉన్న భూమిని కాజేసిన ఘటనలో పది మందిపై కేసు..

12-10-2025 09:02:16 PM

ఇద్దరు బడా రియాల్టర్లను రిమాండ్ కు తరలించిన పోలీసులు..

ఆదిలాబాద్ (విజయక్రాంతి): జిల్లాలో భూ కబ్జా కేసులో చిన్న పెద్ద అనే తేడా లేకుండా తప్పు చేసిన భూకబ్జాదారులందరిపై కేసులు నమోదు అవుతున్నాయి. జిల్లా ఎస్పీగా అఖిల్ మహాజన్ బాధ్యతలు స్వీకరించాక రియల్టర్ల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఇప్పటికే ఎంతోమంది భూ మాఫియా దారులను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. తాజాగా ఎస్.బి.ఐ బ్యాంకు అధీనంలోని భూమిని కబ్జా చేసిన ఘటనలో ఆదిలాబాద్ కు చెందిన బడా రియాల్టర్ లపై కేసులు నమోదు చేయడంతో పాటు రిమాండ్ కు తరలించడం జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది.

ఆదివారం డీఎస్పీ జీవన్ రెడ్డి వివరాలు వెల్లడించారు. బ్యాంక్ ఆధీనంలో భూమిని కబ్జా చేసిన కేసులో రమేష్ శర్మ, ఇబ్రహీం మహమ్మద్ @ మామ్ల సేట్, యతేంద్రనాథ్, హితేంద్రనాథ్, రాకేష్ శర్మ మనోజ్ కుమార్ అగర్వాల్, పూనం వ్యాస్, అనుపమ వ్యాస్, సర్వేయర్ శివాజీలపై కేసు నమోదు చేశారు. ఇందులో రమేష్ శర్మ, మామ్లా సెట్ ను అరెస్ట్ చేసి, 14 రోజుల జ్యూడిషియల్ రిమాండ్ కు తరలించడం జరిగిందని డిఎస్పీ జీవన్ రెడ్డి తెలిపారు.