calender_icon.png 12 October, 2025 | 11:36 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ట్రాక్టర్ ఢీకొని వృద్ధుడు మృతి

12-10-2025 08:26:53 PM

గరిడేపల్లి (విజయక్రాంతి): మండల కేంద్రమైన గరిడేపల్లిలోని గుండాలమ్మ దేవాలయం సమీపంలో యూటర్న్ వద్ద ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వృద్ధుడు మృతి చెందాడు. గరిడేపల్లికి చెందిన బొంత సైదిరెడ్డి(75) అనే వ్యక్తి బంధువుల శుభకార్యం సందర్భంగా గరిడేపల్లి నుంచి పొనుగోడు రోడ్డులో ఉన్న ఫంక్షన్ హాల్ కి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. గరిడేపల్లి నుంచి ఫంక్షన్ కి మోటార్ సైకిల్ పై వెళుతున్న సైదిరెడ్డిని ఎదురుగా వస్తున్న ట్రాక్టర్ ప్రమాదవశాత్తు ఢీకొనడంతో సైదిరెడ్డికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన సైదిరెడ్డిని ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందినట్లు గరిడేపల్లి ఎస్ఐ చలికంటి నరేష్ తెలిపారు. ఈ విషయంపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అప్పచెప్పినట్లు ఆయన వివరించారు.