calender_icon.png 12 October, 2025 | 11:36 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కొత్తకోట రచనలు సామాజిక మార్పు కలిగిస్తాయి

12-10-2025 08:30:44 PM

కేంద్ర సాహితీ అకాడమీ అవార్డు గ్రహీత అంపశయ్య నవీన్‌..

హనుమకొండ (విజయక్రాంతి): కొత్తకోట శ్రీనివాస్‌ రెడ్డి రచనలు సామాజికంగా మార్పు కలిగించే విధంగా వున్నాయని కేంద్ర సాహితీ అవార్డు గ్రహీత అంపశయ్య నవీన్‌ తెలిపారు. మిత్ర మండలి అధ్వర్యంలో విశ్రాంత ఐపీఎస్‌ అధికారి కొత్తకోట శ్రీనివాస్‌ రెడ్డి రచించిన ‘‘పుంజు తోక’’ సంపుటి అవిష్కరణ సభను ఆదివారం హన్మకొండలోని వాగ్దేవి కళాశాలలో సమావేశ ప్రాంగణంలో ఏర్పాటు చేసారు. ఈ కార్యక్రమానికి కేంద్ర సాహితీ అవార్డు గ్రహీత అంపశయ్య నవీన్‌ ముఖ్య అతిధిగా పాల్గొన్న ఈ కార్యక్రమంలో ముందుగా జ్యోతి ప్రజ్వల చేసారు. అనంతరం అంపశ్య నవీన్‌ చేతుల మీదుగా కొత్తకోండ శ్రీనివాస్‌ రెడ్డి రచించిన ‘‘పుంజు తోక’’ సంపుటిని అవిష్కరించారు.

ఈ సందర్బంగా అచార్య బన్న అయిలయ్య, నాగిళ్ళ రామశాస్త్రి, వి.ఆర్‌ విద్యార్థి పుంజు తోక సంపుటిలోని కవితలపై వారి వారి అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ విశ్లేషణాత్మకంగా వివరించడం జరిగింది. అనంతరం ముఖ్య అతిధి అంపశయ్య నవీన్‌ మాట్లాడుతూ కొత్తకోండ శ్రీనివాస్‌ రెడ్డి రచించిన ‘‘పుంజు తోక’’ సంపుటిలోని  సామాజిక స్పూర్తి కలిగించే రీతిలో కవితలు వున్నాయని.  కొత్తకోట కవితలు అభ్యుదయ రచనలుగా వున్నాయి కావున శ్రీనివాస్‌ రెడ్డిని అభ్యుద కవిగా భావిస్తున్నానని. సుధీర్ఘ కాలం పోలీస్‌ శాఖలో తాను పనిచేసిన తన గురించి ఈ సంపుటిలో ప్రస్తావించకపోవడం గమనార్హమని, ముఖ్యంగా ఈ సంపుటి పూర్తిగా నవరసాలతో కూడినదై వుందని, పోలీసులను కూడా చులకనగా చూడవద్దని, వారుసైతం ప్రాణత్యాగాలు చేస్తూ దేశ సేవ చేస్తున్నవారే అంటూ సంపుటిలో కొత్తకోట చక్కగా వివరించడం జరిగిందని, సమాజాన్ని పరిశీలించి, సమాజంలో జరుగుతున్నటువంటి మానవనీయమైన సంఘటనలపై చలించి,స్పందించే మనస్సు వున్నవారు, తన భావాలను అక్షర రూపంలో రూపంలోకి మార్చగలిగిన వారే కవితలు, నవలలు వ్రాయగలరని, రాబోవు రోజుల్లో కొత్తకోండ శ్రీనివాస్‌ రెడ్డి ద్వారా మరిన్ని అభ్యుదయ రచనలు రావాలని అంపశయ్య కోరారు.

విశ్రాంత ఐపీఎస్‌ అధికారి కొత్తకోట శ్రీనివాస్‌ రెడ్డి మాట్లాడుతూ వరంగల్‌ నాకు ప్రత్యేక అనుభూతులను మిగిల్చింది, నేను ఇక్కడ ట్రైనింగ్‌ ఏఎస్పీగా పనిచేయడంతో పాటు, ఇదే జిల్లా ఏస్పీగా పనిచేసే భాగ్యం తనకు కలిగిందని, విద్యార్థి దశ నుండి కవితలు రాయడం అలవాటని, నేను వ్రాసిన కొన్ని అనాడే ప్రచురితం అయ్యాయని, పోలీస్‌ అధికారి అయ్యాక నా అనుభవాలను కేవలం నావరకు మాత్రమే పుస్తకంలో వ్రాసుకునేవాడినని ఈ పుస్తకం రాయడంలో ఎంతో మంది శ్రీశ్రీ,చలం, కాళోజీ లాంటి కవులతో పాటు సినీ దర్శకులు సత్యజిత్‌రే, నర్సింగరావు లాంటి  నాకు స్పూర్తి నిచ్చారాని, ముఖ్యంగా సాహిత్యమనేది సంస్కరం అందించడం మానవ విలువలను కాపాడుతుందని కొత్తకోట శ్రీనివాస్‌ రెడ్డి తెలిపారు. చివరగా ఈ కార్యక్రమములో వరంగల్‌ సాహిత్యవేత్త మల్యాల మనోహర్‌ రావు కొత్తకోండ శ్రీనివాస్‌ రెడ్డితో వున్న పరిచయాన్ని తెలియజేస్తూ ముగింపు ప్రసంగాన్ని చేసారు. ఈ కార్యక్రమములో ట్రై సిటికి చెందిన సాహిత్యవేత్తలతో పాటు, పోలీస్‌ అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.