calender_icon.png 16 September, 2025 | 9:30 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆకతాయిలకు వార్నింగ్

16-09-2025 07:23:25 PM

కుమ్రం భీం అసిఫాబాద్,(విజయక్రాంతి): జిల్లా కేంద్రంలోని బాలికల హాస్టల్ వద్ద అనుమానస్పదంగా ఇద్దరి యువకులు తిరుగుతుండడంతో పాటు ప్రహరీ గోడ ఎక్కే ప్రయత్నం చేస్తుండగా వారిని అదుపులోకి తీసుకున్న షీ టీం ఇన్చార్జ్ ఎస్సై బిక్కలాల్ యువకులకు కౌన్సిలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భవిష్యత్తులో ఎవరైనా యువకులు ఇలాంటి చర్యలకు పాల్పడితే కఠినంగా వ్యవహరించడం జరుగుతుందని వార్నింగ్ ఇచ్చారు. బాలికల వసతి గృహాల వద్ద భద్రత ఏర్పాటు చేసుకోవాలని, విద్యార్థినులకు ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. మహిళలకు, విద్యార్థినిలకు, యువతులకు ఏమైనా ఇబ్బందులు ఎదురైతే 8712670564/65 లేదా 100కి కాల్ చేసి సమాచారం అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో షీ టీం సభ్యులు స్వప్న, రజని ,దినేష్ పాల్గొన్నారు.