16-10-2025 07:33:51 PM
* ఐదో బ్రాంచ్‌ను ప్రారంభించిన సినీ నటుడు మంచు మనోజ్, మంత్రి శ్రీధర్ బాబు..
* అంతర్జాతీయ ప్రమాణాలతో స్వదేశీ బ్రాండ్..
* అందుబాటు ధరలలో ప్రీమియం ఫ్యాషన్..
మణికొండ (విజయక్రాంతి): అంతర్జాతీయ స్థాయి టెక్స్‌టైల్ వ్యాపారానికి హైదరాబాద్ నగరం కేంద్రంగా మారుతోందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు(Minister Duddilla Sridhar Babu) అన్నారు. మణికొండలోని అల్కాపూర్ టౌన్‌షిప్‌లో ఏర్పాటు చేసిన పురుషుల వస్త్ర బ్రాండ్ ‘స్విచ్ రా’ ఐదో స్టోర్‌ను గురువారం ఆయన సినీ నటుడు మంచు మనోజ్(Actor Manchu Manoj), మాజీ ఎంపీ మధు యాస్కి గౌడ్‌తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంచు మనోజ్ మాట్లాడుతూ, స్విచ్ రా స్టోర్ ఫ్యాషనబుల్ కలెక్షన్లకు, సౌకర్యవంతమైన మెన్స్‌వేర్‌కు హాట్‌స్పాట్‌గా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ముఖ్యంగా, పిల్లల దుస్తుల ఎంపిక తల్లిదండ్రులకు కష్టతరంగా ఉంటుందని, ఈ స్టోర్‌లో ఆ సమస్య లేకుండా అద్భుతమైన కలెక్షన్ ఉందని ప్రశంసించారు. స్థానిక హస్తకళను అంతర్జాతీయ ప్రమాణాలతో జోడించి, భారతీయ పురుషుల ఫ్యాషన్‌లో స్విచ్ రా ఒక వినూత్నమైన, బోల్డ్ బ్రాండ్‌గా నిలుస్తుందని అన్నారు.
మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ, నాణ్యమైన వస్త్రాలను అందించాలనే లక్ష్యంతో కల్లెం రాఘవేందర్ రెడ్డి, నంబూరి రాఘవేందర్, నీలా కిషోర్ కుమార్ ఈ షోరూం స్థాపించడం అభినందనీయమని అన్నారు. అన్ని వర్గాల వారికి అందుబాటు ధరలలో ఫ్యాషన్‌ను తీసుకురావడం గొప్ప విషయమని పేర్కొన్నారు. దేశీయంగా తయారైన ఈ ఫ్యాషన్ బ్రాండ్ ప్రపంచవ్యాప్తంగా విస్తరించాలని, ఐదో స్టోర్ కాస్తా వందల స్టోర్లకు పెరగాలని ఆకాంక్షించారు. యువత ఫ్యాషన్ రంగంలో రాణించడం సంతోషంగా ఉందని మాజీ ఎంపీ మధు యాస్కి గౌడ్ తెలిపారు.స్విచ్ రా వ్యవస్థాపకులలో ఒకరైన కల్లెం రాఘవేందర్ రెడ్డి మాట్లాడుతూ, "ప్రీమియం పురుషుల ఫ్యాషన్‌ను అందరికీ అందుబాటులోకి తీసుకురావడంలో ఇది మా మరో ముందడుగు. వియత్నాం, టర్కీల నుంచి నాణ్యమైన మెటీరియల్స్ దిగుమతి చేసుకుని, ప్రపంచ స్థాయి డిజైన్లను అందుబాటు ధరలలో అందించడమే మా లక్ష్యం" అని వివరించారు.