calender_icon.png 17 October, 2025 | 1:45 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పార్టీ శ్రేణుల అభిప్రాయాల మేరకే జిల్లా అధ్యక్షుడి ఎంపిక

16-10-2025 10:57:28 PM

సమావేశంలో మాట్లాడుతున్న ఎఐసీసీ పరిశీలకులు నారాయణస్వామి..

అడ్డకుల: మహబూబ్ నగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ నూతన అధ్యక్షుని ఎంపిక కోసం దేవరకద్ర నియోజకవర్గం అడ్డాకుల మండల కేంద్రంలోని  గోల్డెన్ హోటల్ పై సమావేశాలు గురువారం దేవరకద్ర నియోజకవర్గఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. అడ్డాకుల మండలం మూసాపేట్ మండల్ భూత్పూర్ మండల్ మూడు మండలాల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశాలలో ఏఐసీసీ  కర్ణాటక ఎమ్మెల్సీ శ్రీ నారాయణస్వామి, పిషరిస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి, టీపీసీసీ అబ్జర్వర్లు ఉజ్మా షాకిర్, టిపిసిసి ఆర్గనైట్ అరవింద్ రెడ్డి, దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి,  నాయకులు, కార్యకర్తల నుంచి అభిప్రాయాలను సేకరించారు.

ఈ సమావేశాన్ని ఉద్దేశించి ఏఐసీసీ పరిశీలకులు, కర్ణాటక ఎమ్మెల్సీ సత్యనారాయణ మాట్లాడుతూ... ఈ దేశానికి స్వాతంత్రం తీసుకువచ్చింది కాంగ్రెస్ పార్టీ అని, తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది కూడా కాంగ్రెస్ పార్టీ అని, సమాచార హక్కు చట్టాన్ని తీసుకువచ్చి ప్రజలను చైతన్యవంతం చేసింది కూడా కాంగ్రెస్ పార్టీ అని చెప్పారు. ఏఐసీసీ అగ్ర నాయకులు, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ , ఎఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే కాంగ్రెస్ పార్టీలో కార్యకర్తల అభిప్రాయానికి ఎనలేని ప్రాధాన్యమిస్తున్నారని, కార్యకర్తలకు, నాయకులకు అందుబాటులో ఉండే వారిని పదవులలో నియమించాలని చెప్పారని అన్నారు. మీ అందరి ఆమోదం మేరకే జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుని ఎంపిక జరుగుతుందని, అందుకని మీ మీ అభిప్రాయాలను పరిశీలకులకు వివరించి ఎవరైతే జిల్లా పార్టీని సమర్థవంతంగా నడపగలరో వారి పేరును సూచించాలని చెప్పారు కొత్త అధ్యక్షుడు ఎంపిక కోసం అభిప్రాయాలు సేకరించిన ఈ సమావేశానికి విచ్చేసామని తెలియజేశారు.

నాయకులు కార్యకర్తలు అభిప్రాయాలను సేకరించి ఈ నెల 22న ఏఐసీసీకి నివేదిక అందిస్తామని తెలిపారు. అంతరం మహబూబ్ నగర్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ జిల్లా అధ్యక్షుడిగా ఎంపిక పూర్తి పారదర్శకంగా అందరి అభిప్రాయాలు మేరకు అన్ని అంశాలను పరిగణలకు తీసుకొని ఏఐసి డిసిసి అధ్యక్షుడిని నియమ ప్రకారం తుది నిర్ణయం తీసుకుంటుందని తెలియజేశారు. కానీ అడ్డాకుల మూసాపేట భూత్పూర్ మండలాల కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు మండల నాయకులు అభిప్రాయం మళ్లీ జి మధుసూదన్ రెడ్డిని అధ్యక్షుడిగా నియమించాలని కాంగ్రెస్ నాయకులు ఏఐసీసీ నారాయణ స్వామికి కార్యకర్తలు విజ్ఞప్తి చేశారు.. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు పదవికి. ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి అప్లికేషన్ అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జిఎంఆర్ ఏకగ్రీవంగా కాంగ్రెస్ నాయకులు మండల నాయకులు జిఎంఆర్ కి మద్దతు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు శ్రీహరి, కొత్త రవీందర్ రెడ్డి, ముసపేట మండల అధ్యక్షుడు, శెట్టి శేఖర్, భూత్పూర్ మండల అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి, జిల్లా కార్యదర్శి విజయవాడ రెడ్డి, నాగిరెడ్డి, నాగార్జున రెడ్డి, దశరథ రెడ్డి, తిరుపతయ్య, దేవేందర్ రెడ్డి,, దిలీప్ కుమార్ రెడ్డి, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.