16-10-2025 10:52:20 PM
ఘట్ కేసర్: ఇంటి ముందు పార్కు చేసిన ద్విచక్రవాహనం చోరీకి గురైన సంఘటన ఘట్ కేసర్ పోలీసు స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఇన్ స్పెక్టర్ ఎం. బాలస్వామి తెలిపిన వివరాల ప్రకారం ఘట్ కేసర్ పట్టణంలోని బాలాజీనగర్ లో నివాసం ఉంటున్న చంద్రశేఖర్ ఈ నెల 14న ఇంటి ముందు తన ద్విచక్రవాహనాన్ని (టీఎస్08 జేడబ్ల్యూ 7743) పార్కు చేసి బంధువుల ఇంటికి వెళ్లాడు. ఈనెల 15న ఇంటికి వచ్చి చూసేసరికి ద్విచక్రవాహనం కనిపించలేదు. చుట్టుపక్కల వెతికినా ఫలితం లేకపోవటంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బాధితుని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు.