calender_icon.png 17 October, 2025 | 1:39 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీసీ రిజర్వేషన్ అమలు కొరకు రేపు జరిగే బంద్ ను జయప్రదం చెయ్యండి

16-10-2025 10:41:58 PM

మంథనిలో బీసీ సంఘాల నాయకుల పిలుపు

మంథని (విజయక్రాంతి): బీసీ సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు శుక్రవారం జరిగే రాష్ట్రవ్యాప్త బంద్ విజయవంతం చేయాలని, గురువారం మంథని పట్టణంలోని మంథని విద్యార్థి యువత కార్యాలయంలో బీసీ జేఏసీ, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, బీసీ నాయకుల ఆధ్వర్యంలో సన్నాక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా బీసీ నాయకులు సంయుక్తంగా మాట్లాడుతూ బీసీ రిజర్వేషన్లు అమలు కొరకు, చట్టసభల్లో 42 శాతం రిజర్వేషన్లను వెంటనే అమలు చేయాలని, పార్లమెంటులో బీసీ బిల్లును ఆమోదింప చేయాలని, ఈ నెల 18న జరిగే రాష్ట్రవ్యాప్త బంద్ కు మంథని నియోజకవర్గంలోని అన్ని మండలాలతో పాటు, మంథని పట్టణంలో కూడా బందును జయప్రదం చేయాలని ప్రజలను, స్థానిక వ్యాపారవేత్తలను కోరారు.

అనేక సంవత్సరాలుగా అనేక బీసీ సంఘాలు కొట్లాడుతున్నప్పటికీ నేడు కాంగ్రెస్ రాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవో నెంబర్ 9 అమలు చేయాలని గవర్నర్ వెంటనే బిల్లును ఆమోదించి రాష్ట్రపతికి పంపించాలని, లేని పక్షంలో ఇక్కడ జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు అన్యాయం జరుగుతుందని, కావున గవర్నర్ వెంటనే రాష్ట్రపతికి పంపించి ఆర్టికల్ 9 లో చేర్చి బీసీ బిల్లును ఆమోదింప చేసుకోవడానికి ఇప్పటికైనా బీసీలందరూ రాజకీయాలకతీతంగా ఒక్కటై 18న రాష్ట్రవ్యాప్త బంద్ ను జయప్రదం చేస్తే, ఖచ్చితంగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు దిగిరాక తప్పదని, కావున ఈ బంద్ ను జయప్రదం చేయడానికి ప్రతి ఒక్కరు బీసీల ఐక్యతను చాటి చెప్పాలని కోరారు.

ఈ కార్యక్రమానికి బీసీ జెఏసి నాయకుడు బెజ్జంకి డిగంబర్ అధ్యక్షత వహించగా తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి పెండ్యాల రామ్ కుమార్, జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు గుండ్ల సమ్మయ్య, తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం జిల్లా కార్యదర్శి గుండోజు ప్రవీణ్, బిఆర్ఎస్ నాయకుడు కనవేన శ్రీనివాస్ యాదవ్, బిజెపి పట్టణ మండల అధ్యక్షులు సబ్బని సంతోష్, వీరబోయిన రాజేందర్, సిపిఎం నాయకులు బూడిద గణేష్, గోర్రెంకల సురేష్, ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు మంతెన చందు మాదిగ, మున్నూరు కాపు సంఘం డివిజన్ అధ్యక్షులు ఆకుల కిరణ్ పటేల్, దళిత హక్కుల పోరాట సమితి నాయకుడు బూడిద తిరుపతి, స్వర్ణకార సంఘం అధ్యక్షుడు మోదుంపురం విజయ్ కుమార్, మేరు సంఘం నాయకులు మాడిశెట్టి ప్రతాప్, రాయి వేణుగోపాల్, పద్మశాలి సంఘం నాయకుడు బత్తుల సత్యనారాయణ, మాజీ ఎంపీపీ కొండా శంకర్, సామాజికవేత్త ఇరుగురాల ప్రసాద్, ఐడీసీఎస్ అధ్యక్షుడు వేల్పుల సురేష్, ఎమ్మార్పీఎస్ నాయకుడు మంతెన లింగన్న లతోపాటు తదితరులు పాల్గొన్నారు.