16-10-2025 07:30:36 PM
వలిగొండ (విజయక్రాంతి): "బంద్ ఫర్ జస్టిస్" జయప్రదం చేయాలని బీసీ సంఘం జిల్లా నాయకుడు సాయిని యాదగిరి కోరారు. గురువారం వలిగొండ మండల కేంద్రంలో స్వర్ణకారుల భవనంలో అఖిలపక్ష పార్టీలు ,వివిధ కుల సంఘాల తో సమావేశం నిర్వహించారు ఈ సమావేశం సాయిని యాదగిరి మాట్లాడుతూ బంద్ ఫర్ జస్టిస్ పిలుపుతో 18న జరగబోయే బందుకు వ్యాపార వాణిజ్య సంస్థలు , విద్యాసంస్థలు, ప్రజలు స్వచ్ఛందంగా సహకరించాలన్నారు. బీసీలకు 42% రిజర్వేషన్ అమలు చేసే వరకు కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకురావాలన్నారు రానున్న కాలంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహించి బీసీలకు న్యాయమైన డిమాండ్ 42 శాతం రాజకీయ ,ఉద్యోగ భద్రత కు రిజర్వేషన్ల అమలుకై పోరాటం కొనసాగిస్తామని ఈ సందర్భంగా అన్నారు.