calender_icon.png 17 October, 2025 | 1:39 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

8 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఎస్ఎఫ్ఓ

16-10-2025 10:49:27 PM

ఫైర్ ఆఫీసులో దీపావళికి ముందే పేలిన టపాసులు..

లంచం అడిగితే ఫిర్యాదు చేయండి ఏసిబి డిఎస్పి..

నల్గొండ క్రైమ్: 8 వేల లంచం తీసుకుంటూ జిల్లా కేంద్రంలోని అగ్నిమాపక కార్యాలయంలో స్టేషన్ ఫైర్ ఆఫీసర్ ఎ. సత్యనారాయణ రెడ్డి గురువారం ఏసీబీకి రెడ్ హ్యాండ్ గా పట్టుబడ్డారు. దీపావళి సందర్భంగా క్రాకర్స్ షాపు ఏర్పాటు చేయడానికి షాపు నిర్వాహకుడు ఎన్ఓసి అడిగారు. ఎన్ఓసి ఇచ్చేందుకు 10 వేలు లంచం డిమాండ్ చేయగా బాధితుడు ఏసిబి అధికారులకు ఫిర్యాదు చేశాడు. స్టేషన్ ఫైర్ ఆఫీసర్ సత్యనారాయణ రెడ్డికి రూ.8వేలకు లంచం ఇచ్చేందుకు ఒప్పందం చేసుకొని ఎన్జీ కాలేజీలో కలిసి మాట్లాడిన తర్వాత బైక్ ట్యాంక్ కవర్లో 8 వేలు పెట్టాడు.

ఏసిబి అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. జిల్లా ఫైర్ అధికారి సందేశ్ కుమార్ కి సమాచారం ఇచ్చారు. శుక్రవారం నాంపల్లి కోర్టులో హాజరు పరుస్తామని, నివాసంలో సోదాలు నిర్వహిస్తామని ఏసిబి డిఎస్పి జగదీష్ చందన్ తెలిపారు. అధికారులు ఎవరైనా తన విధులు నిర్వహించకుండా లంచం డిమాండ్ చేస్తే ఏసీబీ టోల్ ఫ్రీ నెంబర్ 1064, ట్విట్టర్,ఫేస్బుక్ నేరుగా ఫిర్యాదు చేసిన వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు.