calender_icon.png 17 October, 2025 | 1:50 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మాల మహానాడు రాక్స్ జిల్లా అధ్యక్షులుగా నక్క శ్రీనివాస్

16-10-2025 10:53:57 PM

మందమర్రి (విజయక్రాంతి): మాల మహానాడు రాక్స్ జిల్లా అధ్యక్షులుగా క్యాతనపల్లి మున్సిపాలిటీకి చెందిన నక్క శ్రీనివాస్ ను నియమిస్తూ రాక్స్ జాతీయ అధ్యక్షులు రత్నాకర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు గురువారం ఆయనకు నియామక పత్రాన్ని అందచేశారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ తనపై నమ్మకంతో జిల్లా అధ్యక్ష బాధ్యతలు అప్పగించిన జాతీయ అధ్యక్షులకు కృతజ్ఞతలు తెలిపారు. జిల్లాలో మాల మహానాడు రాక్స్ బలోపేతానికి తనవంతు కృషి చేస్తానని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జై భీమ్ సైనిక రాష్ట్ర అధ్యక్షులు పురుషోత్తం, దళిత సామాజిక ఉద్యమకారులు బొజ్జ శరత్, తీగల శ్రీనివాస రావు, బల్లెం లక్ష్మణ్ గజెల్లి రాజు, ప్రభాకర్ లు పాల్గొన్నారు.