calender_icon.png 18 August, 2025 | 11:24 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అనారోగ్యంతో బాధపడుతున్న హోంగార్డ్ శివకుమార్

18-08-2025 10:22:13 PM

అండగా నిలిచి ఆర్థిక సహయం అందించిన జిల్లా పోలీస్ యంత్రాంగం

పోలీస్ యంత్రాంగాన్ని అభినందించిన జిల్లా ఎస్పీ

రాజన్న సిరిసిల్ల,(విజయక్రాంతి): జిల్లాలో హోంగార్డుగా విధులు నిర్వహిస్తూ అనారోగ్యంతో బాధపడుతున్న శివకుమార్ కి జిల్లా పోలీస్ యంత్రాంగం బాసటగా నిలిచి స్వచ్ఛందంగా రూ.55,000/- జమచేసి కుటుంబా సభ్యులకు ఈరోజు జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ మహేష్ బి.గితే చేతుల మీదుగా శివకుమార్ కుటుంబ సభ్యులకు అందించడం జరిగింది. పోలీసుల కుటుంబాలకు పోలీస్ శాఖ అన్ని రకాలుగా అండగా నిలుస్తుందని,తోటి సిబ్బంది ఆపదలో ఉన్నప్పుడు ముందుకు వచ్చి ఆర్థిక సహాయం అందించడం అభినందనీయమని ఎస్పీ అన్నారు.