calender_icon.png 18 August, 2025 | 11:56 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శివాలయాల్లో భక్తుల పూజలు

18-08-2025 10:26:31 PM

నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్ జిల్లాలోని వివిధ శివాలయాలు శ్రావణ చివరి సోమవారాన్ని పురస్కరించుకొని భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి పూజలు చేశారు. జిల్లాలోని కదిలి పరమేశ్వర ఆలయంతో పాటు సిద్ధిలకుంట సూర్యపూర్ ఓలా చీరాల ముధోల్ బ్రహ్మేశ్వర్ రాజేశ్వర ఆలయం వెయ్యి లింగాల గుడి టెంపుల్ శివాలయం తదితర ఆలయాలు ఉదయం నుండి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామివారి దర్శనానికి క్యూలైన్లు కట్టారు. శివలింగాలకు అభిషేకాలు, పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులకు అన్ని వసతులు కల్పించినట్టు అధికారులు తెలిపారు.