18-08-2025 10:29:11 PM
హనుమకొండ,(విజయక్రాంతి): హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండల కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో యూరియా అందడం లేదని మండల కేంద్రంలో పలు గ్రామాల రైతులు సోమవారం ధర్నా నిర్వహించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, జిల్లా మంత్రి పొన్నం ప్రభాకర్ లు నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తున్నారని రైతులు ఆందోళన చేశారు.
జిల్లాలోని పలు మండలాల్లో రైతులకు యూరియా కొరత ఉందని కమలాపూర్, భీమదేవరపల్లి, వేలేరు, ధర్మసాగర్, హసన్ పర్తి తదితర మండలాల్లో యూరియా కొరత నెలకొందని రైతులుకు సరిపడా యూరియాను సరపర చేయాలని రైతులు ఆందోళన నిర్వహించారు. సంబంధిత శాఖ అధికారులను వివరణ అడిగినందుకు ఫోన్లో సంప్రదించగా ప్రజావాణి కార్యక్రమం ఉన్నందువలన అధికారులు అందుబాటులో కి రాలేదు.