18-08-2025 10:11:45 PM
జాజిరెడ్డిగూడెం: మండల పరిధిలోని తిమ్మాపురం గ్రామానికి ఎమ్మెల్యే మందుల సామేలు సహకారంతో మంజూరి అయిన రెండు హైమాస్ట్ సెంట్రల్ లైట్లను పీఏసీఎస్ మాజీ చైర్మన్ ఇందుర్తి వెంకటరెడ్డి,రాజ్యాంగ పరిరక్షణ సమితి మండల కో-ఆర్డినేటర్ జీడి వీరస్వామి,మాజీ సర్పంచ్ పాలెల్లి సురేష్ ఆదేశానుసారం సోమవారం గ్రామంలోని బొడ్రాయి వద్ద ఒకటి,ఎస్సీ కాలనీలోని రచ్చబండ వద్ద మరొకటి ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పలువురు కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ నిరంతరం కృషి చేస్తుందని అన్నారు.