18-08-2025 10:09:11 PM
మునుగోడు,(విజయక్రాంతి): తెలుగు, ఆంగ్లం, గణితం పరిసరాల విజ్ఞానం వంటి అంశాలలో ప్రాథమిక స్థాయిలోనీ ప్రతి విద్యార్థి అర్థవంతంగా నేర్చుకునేలా బోధన అభ్యాసన సామాగ్రి ఉపయోగపడాలని మండల విద్యాధికారి టి.మల్లేశం అన్నారు. సోమవారం మునుగోడు మండల కేంద్రంలోనీ ఉన్నత పాఠశాలలో తొలి మెట్టు (ఎఫ్.ఎల్.ఎన్) కార్యక్రమం లో భాగంగా మండలంలోని అన్ని ప్రాథమిక ప్రాథమికోన్నత పాఠశాలలచే బోధన అభ్యాసన సామాగ్రి (టిఎల్ఎం) మేళా నిర్వహించి మాట్లాడారు.
విద్యార్థులు కనీస సామర్ధ్యాలు సాధించేలా టి.ఎల్.ఎం ఉండాలని, ఇక్కడ ప్రదర్శించిన బోధనా సామాగ్రి పాఠశాలలో తప్పకుండా అమలు చేయాలని కోరారు. విద్యార్థులు తెలుగు,ఇంగ్లీష్, గణితం అంశాలలో మనం ఎంతో కృషి చేస్తేనే కనీస సామర్ధ్యాలు సాధించడం సాధ్యం అన్నారు. ఈ మేళా కార్యక్రమంలో గెలుపు పొందిన పది ఉత్తమ బోధన అభ్యాసన సామాగ్రి టీచర్లకు ప్రశంసా పత్రం, షీల్డ్ లతో సత్కరించారు.