calender_icon.png 25 September, 2025 | 2:16 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కోల్ ఇండియా పోటీలకు సింగరేణి బాడీ బిల్డర్లు

25-09-2025 12:00:00 AM

బెల్లంపల్లి అర్బన్, సెప్టెంబర్ 24 : మహారాష్ట్రలోని  నాగపూర్ లో అక్టోబర్ నెలలో జరుగనున్న కోల్ ఇండియా బాడీ బిల్డింగ్ ఛాంపియన్ షిప్ పోటీలకు బెల్లంపల్లికి సింగరేణి బాడీ బిల్డర్లు (కార్మికులు) ఎంపిక య్యారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని భూపాలపల్లి సిఈఆర్ క్లబ్ లోఈ నెల 23న జరిగిన సింగరేణి కంపెనీ  బాడీ బిల్డిం గ్ పోటీలలో సింగరేణి ఉద్యోగులైన జనగామ మొగిలి 75 కిలోల విభాగంలో, పెసరి అర్జున్ 70 కిలోల విభాగంలో ప్రథమ స్థానం పొంది కోల్ ఇండియా పోటీలకు ఎంపికయ్యారు.

అలాగే పులి శెట్టి కృష్ణ స్వామి 55 కిలోల విభాగంలో పాల్గొని ద్వితీయ స్థానం పొందారు. వీరు గత కొన్ని సంవత్సరాలుగా స్కై జిమ్ లో శిక్షణ పొందుతున్నారు. కోల్ ఇండియా పోటీలకు ఎంపికైన వీరిని జిమ్ కోచ్ పన్నాల సదానందం, జిమ్ నిర్వాహకులు సిర్ర బాలకృష్ణ, జంబోజు చంద్రశేఖర్, సీనియర్ క్రీడాకారులు అభినందించారు.

కోలిండియా పోటీలకు ఎంపికైన ఏరియా క్రీడాకారులు

మందమర్రి, సెప్టెంబర్ 24 : వర్క్ పీపుల్ స్పోరట్స్ & గేమ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన కంపెనీ స్థాయి వార్షిక పోటీల్లో ఏరియా కార్మిక క్రీడాకారులు పాల్గొని ప్రతిభ కనబరిచి కోల్ ఇండియా స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. బుధవారం భూపాలపల్లి మినీ ఫంక్టన్ హాల్ లో నిర్వహించిన కంపెనీ స్థాయి బాడీబిల్డింగ్, వెయిట్ లిఫ్టింగ్, పవర్ లిఫ్టింగ్ పోటీల్లో ఏరియాకు చెందిన బత్తుల వెంకట స్వామి (ఈఎఫ్‌ఎం ఏరియా వర్క్ షాప్) బాడీ బిల్డింగ్ (95 కేజీ ల విభాగం), బెల్లం అరుణ్ (పంప్ ఆపరేటర్ కాసిపేట్-1) వెయిట్ లిఫ్టింగ్  (79 కేజీ ల విభాగం)లో గోల్ మెడల్స్ సాధించి కోల్ ఇండియా పోటీలకు ఎంపికయ్యారు. కోలిండియా పోటీలకు ఎంపికైన ఏరియా కార్మిక క్రీడాకారులను జనరల్ మేనేజర్ ఎన్ రాధాకృష్ణ, ఎస్‌ఓటు జిఎం విజయ ప్రసాద్, పర్సనల్ మేనేజర్ శ్యామ్ సుందర్‌లు అభినందించారు.

కంపెనీ స్థాయిలో బంగారు పతకాలు..

రెబ్బెన, సెప్టెంబర్ 24 (విజయక్రాంతి) : భూపాలపల్లి లో బుధవారం జరిగిన కంపెనీ స్థాయి వెయిట్ లిఫ్టింగ్, పవర్ లిఫ్టింగ్ పోటీలలో  బెల్లంపల్లి ఏరియా మహిళా ఉద్యోగులు పవర్ లిఫ్టింగ్ 57 kg విభాగంలో అనురాధ, 47 కిలోల విభాగంలో కోట్నక మమత గోల్ మెడల్స్ సాధించి మొదటి స్థానం లో నిలిచి కోల్ ఇండియా పోటీలకు ఎంపికయ్యారు.

బాడీ బిల్డింగ్, 75 కేజీ విభాగంలో జే.మొగిలి గోల్ మెడల్ సాధించి  అక్టోబర్  14 నుండి 16 తేదీ వరకు నాగపూర్ వేదికగా జరిగే కోల్ ఇండియా స్థాయి  పోటీలలో పాల్గొననున్నారు. తెలుసుకున్న జనరల్ మేనేజర్ విజయ్ భాస్కర్ రెడ్డి క్రీడాకారులని అభినందించారు. ఇదే స్ఫూర్తి ని కొనసాగించి కోల్ ఇండియాలో మళ్ళీ పతకాలు సాధించాలని ఆకాంక్షించారు.