calender_icon.png 11 July, 2025 | 8:32 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తెలంగాణ ప్రజలను కాపాడేది బీఆర్‌ఎస్ పార్టీయే

11-07-2025 12:17:41 AM

మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ 

కొత్తపల్లి, జులై 10(విజయక్రాంతి): తెలంగాణ ప్రజలను కాపాడేది బిఆర్‌ఎస్ పార్టీయే అని మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అన్నారు.కరీంనగర్ లోని చింతకుంట లోని బిఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో పార్టీ సమావేశం జిల్లా అధ్యక్షడు జి వి రామకృష్జ రావు ఆధ్యక్షతన జరిగింది .

అనంతరం విలేకరుల సమావేశం లో ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మాట్లాడుతుకరీంనగర్ నగరంలోని రోడ్లు అన్ని వర్షంతో గుంతలుగా మారయని,ప్రభుత్వం వెంటనే అట్టి రోడ్లను బాగుచేయాలన్నారు. బిఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో నగరంలోని రోడ్లు సుందరంగా ఉండి, కళకళలాడెవని అన్నారు.

కరీంనగర్ నియోజకవర్గనికి నిధులు కేటాయించడం లే దని, నిధుల మంజూరులో వివక్ష చూపుతున్నారని, కరీంనగర్ తెలంగాణ లో లేదా, కరీంనగర్ లో కాంగ్రెస్ కార్యకర్తలు లేరా అని, కరీంనగర్ లో నిరుపేదలు లేరా అని ఈ సందర్బంగా ప్రశ్నించారు.

చింతకుంట గాంధీనగర్ లో ఉన్న 640 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను కరీంనగర్ లోని పేదలకు కేటాయించాలన్నారు, స్థానిక సంస్థల ఎన్నికలను సత్వరమే నిర్వహించలని, ఎన్నికలలో బిఆర్‌ఎస్ పార్టీయే అన్ని స్థానాలు గెలుచుకుంటుందని, 42శాతం బిసి రిజర్వేన్లను ఎన్నికల ముం దే నిర్ణయించాలన్నారు.

రైతంగానికి తగిన వర్షపాతం లేక నాట్లు వేసుకోవడానికి ఇబ్బంది పడుతున్నారని వెంటనే కన్నెపల్లి, ఎల్లంపల్లి నుండి నీటిని పంపింగ్ చేసి వరద కాలువ ద్వార మీడ్ మానేరు మరియు ఎల్‌ఎమ్ డి నింపాలని, రైతులకు సకాలంలో నీటిని అందించలని, ప్రతి రైతు కు తగినన్ని యూరియ బస్తాలను ఇవ్వాలని అన్నారు.

హుజురాబాద్ లో మంజూరయినా దళిత బంధు డబ్బులను వెంటనే ఇవ్వాలని డిమాడ్ చేశారు. బిఆర్‌ఎస్ నాయకులు మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్ రావు, మాజీ ఎమ్మెల్యే లు సుంకె రవిశంకర్, ఒడితల సతీష్ బాబు, రసమయి బాలకిషన్‌పాల్గొన్నారు.