06-01-2026 01:34:54 AM
సభా హక్కుల ఉల్లంఘన కింద చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి
స్పీకర్ సూచనల మేరకు అసెంబ్లీకి నోటీసులు
హైదరాబాద్, జనవరి 5 (విజయక్రాంతి) : సీఎం రేవంత్‌రెడ్డిపై బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు స్పీకర్ గడ్డం ప్రసాద్‌కు ఫిర్యాదు చేశారు. నదీ జలాలపై చర్చ సమయంలో సభను తప్పుదోవ పట్టించారని పేర్కొంటూ సభా హక్కుల ఉల్లంఘన కింద చర్యలు చేపట్టాల ని కోరారు. స్పీకర్ సూచనల మేరకు బీఆ ర్‌ఎస్ ఎమ్మెల్యేలు సోమవారం అసెంబ్లీ సెక్రటరీ తిరుపతికి నోటీసులు అందజేశారు. ఇటీవల శాసన సభలో కృష్ణా జలాలపై చర్చ సందర్భంగా తప్పుడు సమాచారం ఇచ్చి సభను తప్పుదోవ పట్టించిన సీఎం రేవం త్‌రెడ్డిపై సభా హక్కుల ఉల్లంఘన కింద చర్య లు చేపట్టాలని కోరారు.
అపెక్స్ కౌన్సిల్ సమావేశ మినట్స్‌పై, రాయలసీమ ఎత్తిపో తల పనుల నిలిపివేత, కృష్ణా జలాల్లో తాత్కా లిక ఒప్పందంపై సీఎం సభను తప్పుదోవ పట్టించారని ఫిర్యాదులో ఆరోపించారు. అ సెంబ్లీ సెక్రటరీకి నోటీసుల అందించిన అనంతరం బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు కేపీ వివేకానంద, కోవాలక్ష్మి, విజయుడు, అనిల్ జాదవ్ అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ ప్రజలను మోసం చేసి ప్రభుత్వాన్ని నడు పుతున్నారని విమర్శించారు.
సీఎం అసెం బ్లీలో ఆన్ రికార్డు పచ్చి అబద్ధాలు మాట్లా డుతున్నార ని అన్నారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులను తానే ఆపానని అంటు న్నారని, కానీ ఆ పనులు ఆపిందెవరో హరీ శ్‌రావు స్పష్టంగా చెప్పారని స్పష్టం చేశారు. ఇప్పుడు రేవంత్‌రెడ్డి తల, మొహం ఎక్కడ పెట్టు కుంటారని ఎద్దేవా చేశారు. రేవంత్‌రెడ్డి అపెక్స్ కౌన్సిల్‌లో ఉన్న అంశాలను తప్పుదో వ పట్టించారని, కృష్ణా నదీ జలాలపై శాశ్వత ఒప్పందం అన్నట్లుగా ప్రజలను, సభను నమ్మించే విధంగా మాట్లా డారని మండి పడ్డారు. రేవంత్‌రెడ్డిపై ప్రివి లేజ్ మోషన్ ఇచ్చామని అన్నారు.
రేవంత్ రెడ్డిపై ప్రివిలేజ్ మోషన్ అంగీకరించాలని స్పీకర్‌ను కోరుతు న్నామని, రేవంత్‌రెడ్డి ప్రజలకు క్షమాపణ చెప్పి లెంపలు వేసుకోవాలన్నారు. అసెంబ్లీ లో మాట్లాడే హక్కులను బీఆర్‌ఎస్ కోల్పోలే దని, మాకు మైక్‌ఇవ్వడానికి కాంగ్రెస్ భయ పడుతోందన్నారు. అసెంబ్లీ కౌరవ సభలాగా మారిందని, చనిపోవాలనే కోరుకునే వారు ఎవరైనా ఉంటారా అని ప్రశ్నించారు. రేవం త్‌రెడ్డి సంకుచిత ఆలోచనతో ఉన్నారని, మాకు అసెంబ్లీలో పీపీటీ ఇవ్వాలని అడగ డం తప్పు ఎట్లా అవుతుందని వారు ప్రశ్నించారు.