calender_icon.png 9 January, 2026 | 12:25 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యార్థినిని అభినందించిన జిల్లా ఎస్పీ

07-01-2026 08:05:02 PM

భైంసా: రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు ఎంపికైన విద్యార్థిని జిల్లా ఎస్పీ జానకి షర్మిల అభినందించారు. బైంసా క్యాంప్ ఆఫీసులో బుధవారం పోలీసు ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. సందర్భంగా బాధితుల నుంచి ఫిర్యాదులు తీసుకుని పరిష్కారానికి చర్యలు చేపట్టారు. అనంత  బాసర మండలం కిర్గుల్ (బి),  గ్రామానికి చెందిన, దిలావర్పూర్ జెడ్‌పిహెచ్‌ఎస్ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న ముత్యాల మనోరంజని అండర్–17 కబడ్డీ పోటీల్లో రాష్ట్ర స్థాయికి ఎంపికైన విషయం తెలుసుకొని విద్యార్థులని అభినందించారు. భవిష్యత్తులో జాతీయ స్థాయిలో కూడా ఉత్తమ ప్రతిభ కనబరచాలని ఆకాంక్షించారు. కష్టపడి సాధన చేస్తే ఏ లక్ష్యమైనా సాధ్యమవుతుందని విద్యార్థినికి ప్రోత్సాహం అందించారు.విద్యతో పాటు క్రీడల్లో కూడా ప్రతిభ కనబరచడం ద్వారా సమాజానికి మంచి ఆదర్శంగా నిలవాలని సూచించారు.