calender_icon.png 9 January, 2026 | 12:25 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

యువత క్రీడల్లో రాణించాలి

07-01-2026 08:00:02 PM

బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు రాచకొండ శ్రీవర్ధన్

​తలాయిలో ఘనంగా ప్రారంభమైన 'దండే విట్టల్ యువసేన' వాలీబాల్ టోర్నమెంట్

బెజ్జూరు,(విజయక్రాంతి): మండలంలోని తలాయి గ్రామపంచాయతీలో 'దండే విట్టల్ యువసేన' ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వాలీబాల్ టోర్నమెంట్‌ను బుధవారం బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు రాచకొండ శ్రీవర్ధన్ ఘనంగా ప్రారంభించారు. ​ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడల వల్ల  ​కేవలం వినోదం మాత్రమే కాదని, శారీరక దారుఢ్యంతో పాటు మానసిక ఉల్లాసాన్ని ఇస్తాయని ఆయన పేర్కొన్నారు. ​క్రీడా మైదానం క్రమశిక్షణను నేర్పుతుందని, ఓటమిని అంగీకరించే గుణాన్ని, గెలుపు కోసం పోరాడే పట్టుదలను అలవరుస్తుందని అన్నారు.

జట్టుగా ఆడే క్రీడల వల్ల యువతలో నాయకత్వ లక్షణాలు మెరుగుపడతాయని సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ప్రతిభావంతులైన క్రీడాకారులను గుర్తించి ప్రోత్సహించడమే ఇటువంటి టోర్నమెంట్ల ప్రధాన ఉద్దేశమని అన్నారు. ఈ కార్యక్రమంలో తలాయి గ్రామ సర్పంచ్ సాయికిరణ్, మొగవెల్లి సర్పంచ్ కోడుప శంకర్ విశ్వేశ్వర్, ఆత్రం నీలయ్య, తిరుపతి, గంగారాం, గ్రామ కార్యదర్శి పోచయ్య, తదితరులు పాల్గొన్నారు