calender_icon.png 8 January, 2026 | 11:52 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రోడ్డు భద్రత నిబంధనలను పాటించాలి

07-01-2026 08:08:51 PM

బండ్లకు నెంబర్ ప్లేట్లు కంపల్సరీ

సర్కిల్ ఇన్స్పెక్టర్ రాజ్ కుమార్ గౌడ్

మరిపెడ,(విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండల కేంద్రంలో జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాల సందర్భంగా తొర్రూర్ డిఎస్పి కృష్ణ కిషోర్ ఆదేశానుసారం బుధవారం మరిపెడ పట్టణ ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ ఆవరణలో ఏర్పాటు చేసిన రోడ్డు భద్రత మాసోత్సవాల సమావేశంలో మరిపెడ సర్కిల్ ఇన్స్పెక్టర్ రాజ్ కుమార్ గౌడ్, ఎస్సై వీరభద్రరావు వారు పాల్గొని మాట్లాడుతూ మద్యం సేవించి వాహనం నడపరాదని, ప్రతి ఒక్క వాహనదారులు ట్రాఫిక్ రూల్స్ నియమ నిబంధనలను పాటించాలి. బైక్ వాహనదారులు త్రిబుల్ రైడింగ్ చేయరాదని మితిమీరిన వేగంతో ప్రయాణించరాదని, ప్రతి ఒక్క వాహనదారులు డ్రైవింగ్ లైసెన్స్, ఇన్సూరెన్స్ కాగితాలు కలిగి ఉండాలని, రాంగ్ రూట్ డ్రైవింగ్ చేయరాదని సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్ఐ కోటేశ్వరరావు, పోలీస్ సిబ్బంది వాహనదారులు తదితరులు పాల్గొన్నారు.