07-01-2026 08:53:09 PM
కుమురంభీం ఆసిఫాబాద్,(విజయక్రాంతి): పరండోలి, ముఖదంగుడా గ్రామపంచాయతీలకు త్రీఫేస్ విద్యుత్ లైన్ వేసేందుకు విద్యుత్ శాఖకు అటవీ శాఖ అనుమతులు మంజూరు చేయాలని కోరుతూ సంబంధిత అధికారులకు వినతిపత్రం అందజేశారు. అదేవిధంగా శంకర్ లొద్ది అటవీ ప్రాంతంలో నివసిస్తున్న ఆదివాసుల ఆరాధ్య దైవమైన కపిలాదేవి పుణ్యక్షేత్రం వద్ద విశ్రాంతి గది నిర్మాణం చేపట్టేందుకు కూడా అటవీ శాఖ అనుమతులు ఇవ్వాలని కోరారు.
ఈ మేరకు బుధవారం జిల్లా కలెక్టర్ వెంకటేష్ ధోత్రే, జిల్లా అటవీ శాఖ కార్యాలయ పాలనాధికారి, అసిఫాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ అజ్మీర్ శ్యామ్ నాయక్‌లను కలిసి వినతిపత్రం సమర్పించినట్లు జాతీయ మానవ హక్కుల కమిటీ జిల్లా చైర్మన్ రాథోడ్ రమేష్ తెలిపారు.ఈ కార్యక్రమంలో పరండోలి సర్పంచ్ రాథోడ్ పుష్పలత చరణ్, ఆలయ పూజారి లచ్చు పటేల్, ఆలయ కమిటీ సభ్యులు, శంకర్ లొద్ది గ్రామస్తులు కాటే మధుకర్ తదితరులు పాల్గొన్నారు.