calender_icon.png 9 January, 2026 | 12:29 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నిమ్స్‌లో 850 పోస్టుల భర్తీకి చర్యలు

06-01-2026 01:32:59 AM

  1. ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగుపడిన వైద్యసేవలు
  2. అసెంబ్లీలో మంత్రి దామోదర రాజనరసింహ వెల్లడి 

హైదరాబాద్, జనవరి 5(విజయక్రాంతి) : నిమ్స్‌లో కొత్తగా సుమారు 850 పోస్టులను భర్తీ చేయబోతున్నామని వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య సేవలు మెరుగుపడటంతో చికిత్స కోసం వచ్చే పేష ంట్ల సంఖ్య పెరుగుతోందని చెప్పారు. ప్రభు త్వ ఆసుపత్రుల్లో అదనంగా 490 వెంటిలేటర్లు, 9 ఎంఆర్‌ఐ యంత్రాలు అందుబాటు లోకి తీసుకొస్తున్నామని వెల్లడించారు.

ఈ మేరకు శాసన సభా ప్రశ్నోత్తరాల సమయంలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో వెంటిలేటర్ల విషయంపై శాసన సభలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు. మరో 490 వెంటిలేటర్లను కొనుగోలు చేస్తున్నామని, వీటిని గాంధీ, ఉస్మానియా, ఎంజీ ఎం వంటి ప్రభుత్వ జనరల్, జిల్లా ఆసుపత్రుల్లో ఏర్పాటు చేస్తామని చెప్పారు. నిమ్స్ ఆసుపత్రికి కేపాసిటీకి మంచి పేషెంట్లు వస్తున్నారని తెలిపారు. పెరిగిన అవసరాలకు అనుగుణంగా నిమ్స్‌లో మరో 125 వెంటిలేటర్లు ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి చెప్పారు. అంతే కాకుండా నిమ్స్‌లో సుమారు 850 పోస్టుల భర్తీకి చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. 

ఈ ఏడాది మరో 79 కొత్త అంబులెన్స్‌లను ఏర్పాటు చేస్తున్నామన్నారు. రాష్ట్రంలో ఏ పాయింట్ నుంచైనా 20 నిమిషాలలోనే చేరేలా ప్రతి 25 కిలోమీటర్లకు ఒక డయాలసిస్ ఏర్పాటుకు ప్రణాళికలు రూపొందించా మని చెప్పారు. ఇకపై సెంట్రల్ మెడిసినల్ స్టోర్స్ నుంచి నేరుగా బస్తీ దవాఖాన్లకు పం పిణీ చేయబోతున్నామని మంత్రి వెల్లడించారు.