calender_icon.png 9 January, 2026 | 12:21 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వెంకటపూర్‌లో వర్షాధార పథకంపై రైతులకు శిక్షణ

07-01-2026 08:50:22 PM

సిద్దిపేట రూరల్: సిద్ధిపేట రూరల్ మండలం వెంకటపూర్ గ్రామ రైతు వేదికలో బుధవారం ఉద్యాన, పట్టు పరిశ్రమ శాఖ ఆధ్వర్యంలో వర్షాధార ప్రాంత అభివృద్ధి కార్యక్రమం కింద రైతులకు అవగాహన, శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమ అధికారి జి.సువర్ణ మాట్లాడుతూ... కూరగాయల సాగులో ఆధునిక పద్ధతులు అవలంబిస్తే అధిక దిగుబడులు సాధ్యమవుతాయని తెలిపారు.

డ్రిప్, స్ప్రింక్లర్, మల్చింగ్, ట్రెల్లిస్ విధానాలు, సేంద్రీయ సాగు లాభాలు వివరించారు. ఆయిల్‌పామ్ సాగుకు ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీలు, నాలుగేళ్ల యాజమాన్య రాయితీలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో రైతులకు ప్లాస్టిక్ పెట్టెలు, వర్మీ కంపోస్ట్ బెడ్స్ పంపిణీ చేశారు. మండల ఉద్యాన అధికారి కౌసల్య, మౌనిక, సుబ్బారావు, ఉద్యాన విస్తరణ అధికారి రమేష్, వ్యవసాయ విస్తరణ అధికారి నవ్య పాల్గొన్నారు.