calender_icon.png 20 December, 2025 | 10:52 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గుర్రపు డెక్క తొలగించని కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకోండి : కార్పొరేటర్ శాంతి

20-12-2025 08:22:09 PM

ఉప్పల్,(విజయక్రాంతి): గత రెండు మూడు నెలలుగా  నాచారం హెచ్ఎంటి పెద్ద చెరువులో గుర్రపు డెక్క తొలగించకుండా  కాలయాపన చేస్తున్న కాంట్రాక్టర్ పై  చర్యలు తీసుకోవాలని నాచారం కార్పొరేటర్  శాంతి సాయి జన్ శేఖర్ అధికారులను ఆదేశించారు. శనివారం రోజున జిహెచ్ఎంసి ఎట్మాలజీ ఎస్సీ మాధవరెడ్డితో కలిసి  కార్పొరేటర్ శాంతి  పెద్ద చెరువు సందర్శించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ  హెచ్ఎంటి పెద్ద చెరువులో  గుర్రపు డెక్క  పెరిగిపోవడంతో దోమలు వృద్ధి  చెంది కాలనీ వాసులు డెంగ్యూ బారిన పడుతున్న గుర్రపు డెక్క తొలగించకుండా కాంట్రాక్టర్ ఇష్టం రాజంగా వ్యవహరించడం సరికాదన్నారు. పెద్ద చెరువులోని గుర్రపు డెక్క తొలగించి 4 నెలలు గడిచిందని ఇంతవరకు గుర్రపు డెక తొలగించకుండా కాంట్రాక్టర్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆమె ఆరోపించారు.

గుర్రపు డెక్క తొలగించే వరకు కాంట్రాక్టర్ కు ఎలాంటి బిల్లులు చెల్లించోదని అధికారులను ఆమె ఆదేశించారు. దీనికిగాను స్పందించిన ఎటమాలజి ఎస్సీ మాధవరెడ్డి త్వరలోనే గుర్రపు డెక్క తొలగించిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ నరసింహ గ్రేటర్ బీఆర్ఎస్ నాయకులు   సాయి జెన్ శేఖర్ నాయకులు కట్ట బుచ్చన్న గౌడ్ విట్టల్ యాదవ్ మోహన్ రెడ్డి ఎర్రం శ్రీనివాస్ రెడ్డి ఇక్బాల్ తదితరులు పాల్గొన్నారు.