calender_icon.png 22 August, 2025 | 9:51 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎర్త్ సైన్స్ యూనివర్సిటీలోని డిగ్రీ కోర్సులను సద్వినియోగం చేసుకోండి

22-08-2025 06:56:56 PM

మైనార్టీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి  యాకూబ్ పాషా

కొత్తగూడెం,(విజయక్రాంతి): ఎంపీసి, బైపీసి పూర్తి చేసిన యువతి,యువకుల కొరకు రాష్ట్ర ప్రభుత్వం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, కొత్తగూడెంలోని డా.మన్మోహన్ సింగ్ ఎర్త్ సైన్స్ యూనివర్సిటీలో ఈ యేడాది నుంచి ప్రవేశపెడుతున్న బీఎస్సీ(జియాలజీ), బీఎస్సీ (ఎన్విరాన్మెంటల్ సైన్స్) డిగ్రీ కోర్సులను సద్వినియోగం చేసుకోవాలని మైనార్టీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎండి. యాకూబ్ పాషా  శుక్రవారం ఒక ప్రకటన లో తెలిపారు.

భారతదేశంలోనే మొట్ట మొదటి సారిగా స్థాపించబడిన ఈ యూనివర్సిటీలో 3 ఏళ్ళ డిగ్రీ ప్రవేశాలు పొందే విద్యార్దులకు ఉచిత హాస్టల్ సౌకర్యం, పారిశ్రామిక సందర్శనలు, లైబ్రరీ, ల్యాబ్‌లు, విశాలమైన తరగతి గదులు, నిష్టాతులైన అధ్యాపకులతో బోధన జరుగుతుందన్నారు.

కోర్సులు పూర్తి చేసిన విద్యార్దులకు ప్రభుత్వ, ప్రైవేట్ రంగాలలో మన దేశంతో పాటు ఇతర దేశాల్లో కూడా ఉద్యోగ అవకాశాలు  ఉంటాయన్నారు. ఎస్సి, ఎస్టి, బిసి, ఓసి మరియు మైనారిటీ  విద్యార్దులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఆసక్తి కలిగిన విధ్యార్దులు ఈ నెల 26 వ తేదీ వరకు యూనివర్సిటీ లో దరఖాస్తు చేసుకోవాలని అన్నారు. ఇతర వివరాల కొరకు 9985137137, 8500378531 నంబర్ లలో సంప్రదించాలని కోరారు.