calender_icon.png 22 August, 2025 | 10:14 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గంజాయి బెట్టింగ్ యాప్స్ నిర్మూలకై కృషి చేయాలి : డివైఎఫ్ఐ

22-08-2025 06:52:25 PM

నకిరేకల్,(విజయక్రాంతి): మాదకద్రవ్యాలు గంజాయి ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ నిర్మూలకై యువత ప్రజలు కృషి చేయాలని డివైఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు గద్దపాటి సుధాకర్ పిలుపునిచ్చారు. శుక్రవారం కట్టంగూరు మండలంలోని చెర్వుఅన్నారం హైస్కూల్లో ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో డ్రగ్స్ గంజాయి మాదక దవ్యాలు  బెట్టింగ్ యాప్స్ నిర్మూలనకై అవగాహన సదస్సు నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డ్రగ్స్ గంజాయి మాదకద్రవ్యాలు పట్టణంలోనే కాదు గ్రామాలకు సైతం ఈ మహమ్మారి వ్యాపిస్తున్నది ఆయన తెలిపారు. దాని పట్ల విద్యార్థులు యువకులు అవగాహన కలిగి ఉండాలని దాని నిర్మూలకై విద్యార్థులు, యువతి యువకులు కృషి చేయాలని కోరారు. మానసిక పరిపక్వత కలిగి చెడు వ్యసనాలకు బానిస కాకుండా బావి భారత భావి భారత పౌరులుగా ఉండాలని ఆ యన సూచించారు.