calender_icon.png 23 August, 2025 | 1:07 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పోలీసులు ప్రజలకు అందుబాటులో ఉండాలి

22-08-2025 07:00:43 PM

బాధితులకు సత్వర సేవలు అందించాలి 

వన్ టౌన్ పోలీస్ స్టేషన్ తనిఖీలో ఎస్పీ 

నల్గొండ టౌన్,(విజయక్రాంతి): పోలీస్ సిబ్బంది ఎల్లప్పుడు, ప్రజలకు అందుబాటులో ఉంటూ  బాధితులకు సత్వర సేవలు అందించాలని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్  ఆదేశించారు. శుక్రవారం ఆయన  జిల్లా కేంద్రంలోని వన్ టౌన్  పోలీస్ స్టేషన్ ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ లోని పరిసరాలను పరిశీలించారు.

పోలీస్ స్టేషన్ డైరీ, రిసెప్షన్ రిజిస్టర్ తనిఖీ చేసి, పట్టణ పరిధిలో నమోదవుతున్న నేరాలు తీరుతెన్ను లు కేసుల స్థితిగతులు మొదలగు అంశాలను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ బాధితులకు  నాణ్యమైన వేగవంతమైన దర్యాప్తు చేసి న్యాయం జరిగే విధంగా చూడాలని ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్లాలని సూచించారు. గ్రామ రిజిస్టర్లు, హిస్టరీ సీట్స్, రౌడీ సీడ్స్, సస్పెక్ట్ సీట్స్ ను, ఎప్పటికప్పుడు తనిఖీ చేయాలని అన్నారు.

బ్లూ కొట్టు విధులు, పెట్రో కార్ విధులు, ప్రధానమైనవి సంఘటన స్థలాన్ని త్వరగా చేరుకొని,ప్రాథమికంగా బాధితులకు భరోసా కల్పించాలని సూచించారు, కేసులు పెండింగ్ ఉండకుండా చర్యలు తీసుకోవాలని సిబ్బందికి తెలిపారు. జట్టుగా పనిచేస్తూ లక్ష్యంతో ముందుకెళ్లే పోలీస్ అనుకున్న విజయాలను సాధించవచ్చు అని ఎస్పి కోరారు. అనంతరం పోలీస్ స్టేషన్ ఆవరణలో ఎస్పి  మొక్కలు నాటారు.