22-10-2025 07:31:27 PM
ముఖ్యఅతిథిగా చీఫ్ విప్ బీర్ల ఐలయ్య..
మేడిపల్లి (విజయక్రాంతి): పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని మేడిపల్లి శ్రీ వీరాంజనేయ స్వామి దేవాలయం ప్రాంగణంలో పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ యాదవ సంఘం అధ్యక్షులు బుచ్చి యాదవ్ ఆధ్వర్యంలో మల్లికార్జున స్వామి గుడి ప్రాంగణంలో సదర్ సమ్మేళనం మంగళవారం రాత్రి ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ బీర్ల ఐలయ్య, మేడ్చల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ తోటకూర వజ్రేష్ యాదవ్, మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్ రెడ్డి హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఐలయ్య మాట్లాడుతూ... సదర్ అంటే ఒకప్పుడు హైదరాబాద్ నడిబొడ్డుకే పరిమితం అయ్యేది. ఇప్పుడు రాష్ట్రమంతటా గల్లీ గల్లీలో కూడా నిర్వహిస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో బోడుప్పల్ పీర్జాదిగూడ మాజీ మేయర్లు తోటకూర అజయ యాదవ్, అమర్ సింగ్, మేడ్చల్ నియోజకవర్గ బి బ్లాక్ ప్రధాన కార్యదర్శి కొత్త కిషోర్ గౌడ్, పిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ అధ్యక్షులు తుంగతుర్తి రవి, మాజీ డిప్యూటీ మేయర్ శివ కుమార్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.