calender_icon.png 13 May, 2025 | 4:37 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పాత ఇనుప సామాన్ల షాపులో అగ్నిప్రమాదం

12-05-2025 10:48:19 PM

మంటలు ఆర్పివేసిన ఫైర్ అధికారులు

ఖానాపూర్,(విజయక్రాంతి): నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణ కేంద్రంలో అగ్నిప్రమాదం సంఘటన చోటుచేసుకుంది. సోమవారం సాయంత్రం పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజ్ పక్కన ఉన్న శంకర్ స్క్రాప్ షాపు పాత ఇనుప సామాను దుకాణంలో యజమాని వెల్డింగ్ పనిచేస్తుండగా అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. గమనించిన యజమాని ఫైర్ స్టేషన్ కి ఫోన్ చేయగా అధికారులు స్పందించి మంటలను ఆర్పి వేశారు. సుమారు రెండు లక్షల ఆస్తి నష్టం జరిగినట్టు అధికారులు అంచనా వేశారు. మంటలు ఆర్పడం లో అగ్నిమాపక సిబ్బంది జావిద్ అలీ, ఖదీర్ ఖాన్ ,హుస్సేన్, కట్ల వెంకటేష్, శ్రీకాంత్ ,సాయి, తదితరులు ఉన్నారు.