calender_icon.png 13 May, 2025 | 4:26 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

టీబీజీకేఎస్ చొరవతో పీవీ కాలనీ ఏరియా అంతర్గత రోడ్లకు మహర్దశ

07-05-2025 01:11:10 AM

రూ 1. 83 కోట్లతో అంతర్గత రోడ్లు ఏరియా టీబీజీకేఎస్ వైస్ ప్రెసిడెంట్ నాగెల్లి 

మణుగూరు మే 6 (విజయ క్రాంతి)ఏరియా ప్రగతి కోసం రేయింబవళ్లు కష్టపడి పనిచేసే కార్మికుల సంక్షేమానికి ఏరియా జనరల్ మేనేజర్ దుర్గం రామ చందర్ అత్యధిక ప్రాధాన్యత ఇ స్తూ కాలనీ ఏరియా లో అంతర్గత రోడ్లు పనుల కోసం రూ కోట్ల  నిధులు వచ్చేస్తున్నారని ఏరియా టి బి జి కె యస్ వైస్ ప్రసిడెంట్ నాగెల్లి వేంకటేశ్వర్లు తెలిపారు.

మంగళవారం  పీవీ కాలనీ జయశంకర్ సార్ టి బి జి కె యస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన  మాట్లాడుతూ పీవీ కాలనీ, బాంబే కాలనీ ఏరియా లో అంతర్గత రోడ్లు అధ్వాన్న స్థితిలో ఉండడం వల్ల కార్మిక కుటుంబాలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.

త్వరితగతిన కాలనీ ఏరియాల్లో రోడ్లు మెరుగుపరచాలని పలు మార్లు మణుగూరు ఏరియా తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం ఏరియా జనరల్ మేనేజర్, ఏ జి యం సివిల్ కు వినతి పత్రాలు అందించడం జరిగిందన్నారు.

కార్మిక సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని టి బి జి కె యస్ ఇచ్చిన విజ్ఞప్తి  యాజమాన్యం స్పందించి పీవీ కాలనీ ఏరియా లో అంతర్గత రోడ్లు పనుల కోసం రూ 1.83 కోట్ల నిధులు మంజూరు చేసి, సోమవారం నుంచే పనులు  ప్రారంభం చేయడం పట్ల కార్మిక వర్గం  సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తున్నారు.ఈ కార్యక్రమంలో నాయకులు బంగారి పవన్ కుమార్, మునిగేల నాగేశ్వర రావు, మస్తాన్ రాజ్ కుమార్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.