calender_icon.png 22 January, 2026 | 3:38 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నర్సరీలో మొక్కలను సంరక్షించాలి..

25-10-2024 03:41:03 PM

మందమర్రి (విజయక్రాంతి): మండలంలోని వివిధ గ్రామ పంచాయతీల నర్సరీలలో మొక్కలను సంరక్షించాలని మండల పరిషత్ అభివృద్ధి అధికారి ఎన్.రాజేశ్వర్ కోరారు. శుక్రవారం మండలంలోని పొన్నారం గ్రామపంచాయతీలోని నర్సరీని ఆయన సందర్శించారు. నర్సరీలలో మొక్కలను నీరు సమృద్ధిగా పట్టించి, మొక్కలను సంరక్షించాలని సూచించారు. మొక్కల సంరక్షణలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఈజీఎస్ ఏపీఓ రజియా సుల్తానా, టిఏ రాజమల్లు, పంచాయితీ సెక్రెటరీ హరీష్ ఫీల్డ్ అసిస్టెంట్ ఈధ లింగయ్యలు పాల్గొన్నారు.